అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న వైరం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తనను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందనే వార్తలు ఎక్కువవుతున్న క్రమంలో.. ట్రంప్ ఆ దేశానికి అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ తనపై దాడికి ప్రయత్నిస్తే.. ఆ దేశాన్ని భూమి మీదే లేకుండా తుడిచి పెట్టాలని తన అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “నాకు చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి. నాకు ఏమైనా జరిగితే.. ఇరాన్‌ను ఈ భూమి మీద నుంచి తుడిచి పెట్టేయండి అని నా సైనిక సలహాదారులకు చెప్పాను” అని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఒక రోగిగా అభివర్ణించిన ట్రంప్.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు.
Read Also: AP: దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ .. భారీ పెట్టుబడులే లక్ష్యం

ధీటుగా స్పందించిన ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబుల్ ఫజల్ షేకర్చి ధీటుగా స్పందించారు. “మా నాయకుడిని ఎవరైనా తాకాలని చూస్తే.. ఆ చేతిని నరకడమే కాదు వారి ప్రపంచాన్నే పూర్తిగా తగులబెడతాం” అని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా యుద్ధ వాతావరణానికి దారితీస్తోంది. గత ఏడాది కాలంగా ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభంపై జరుగుతున్న నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం.. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 4,519 మంది పౌరులు మరణించారు. సుమారు 26,300 మందిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ మరణాలకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపిస్తుండగా.. శాంతియుత నిరసనకారులను చంపడం సరికాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే కొనసాగితే.. తమ దేశం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: