టీజీ (Telangana) లో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.
Read Also: Google : తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాలని లక్ష్యం
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం.. నగర్ వన్ యోజన పథకాన్ని 2020 జూన్ 5న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. పట్టణాల పరిధిలో అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు ద్వారా.. పర్యావరణ సమతుల్యత కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా, మొదటి ఐదేళ్లలో 200 పట్టణాల్లో అర్బన్ ఫారెస్టులను అభివృద్ధి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు 1000 నగరాల్లో వీటిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా తెలంగాణలో 6 అర్బన్ ఫారెస్టులకు ఆమోదం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: