తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విచారణ తీరుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న విచారణను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సిట్ (SIT) విచారణ కాదని, కేవలం ఒక ‘చిట్టి విచారణ’ అని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఈ కేసులో పస లేదని, ఇదొక ‘లొట్ట పీసు’ కేసు అంటూ కొట్టిపారేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నేతలను విచారణలు, కమిషన్ల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి అభాండాలు వేస్తోందని ఆయన మండిపడ్డారు.
Finance: కోలుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానా
ప్రభుత్వం తన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలను పక్కన పెట్టి, కేవలం బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. దీనినే ఆయన ‘డైవర్షన్ పాలిటిక్స్’ (మళ్లింపు రాజకీయాలు) గా అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం పాత కేసులను తోడుతోందని, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు నైనీ బొగ్గు బ్లాక్ రద్దు అంశంపై కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నైనీ బ్లాక్ రద్దు వెనక పెద్ద ఎత్తున ‘వాటాల పంచాయితీ’ ఉందంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రద్దు నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రభుత్వం దాస్తోందని, ఇందులో లోతైన అవినీతి కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కీలక నిర్ణయాలను మారుస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆయన నిలదీశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com