ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇరాన్‌పై చర్య తీసుకుంటామని అమెరికా సంకేతాలిస్తోంది. ఈ సమయంలో భారత్‌కు చెందిన 16 మందిని ఇరాన్(Iran)లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మందిని జైలులో పెట్టారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా డీజిల్‌తో వెళుతున్నారనే ఆరోపణలపై దిబ్బా ఓడరేవు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ అధికారులు ‘ఎమ్ టీ వాలియంట్ రోర్’ అనే నౌకను 18 మంది సిబ్బందితో పాటు డిసెంబరు 8న స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 6న ఇరాన్ అధికారులు ఈ ఓడలోని భారతీయ సిబ్బందిలో పదిమందిని జైలులో పెట్టారు. ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సి యాజమాన్యంలోని ఈ నౌకలో 16 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశీ, ఒక శ్రీలంకన్ ఉన్నారు.
Read Also: China: చైనాలో తీవ్రంగా తగ్గిన జనసంఖ్య..ఆందోళనలో ప్రభుత్వం

‘ఓడలో అక్రమ డీజిల్ ఉందనే ఆరోపణలు’
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ విభాగంలో పనిచేస్తున్న భారత ఫారిన్ సర్వీసు అధికారి ఎం. ఆనంద్ ప్రకాశ్ బీబీసీకి ధ్రువీకరించారు. “ఈ కేసు అక్కడి కోర్టులో పెండింగ్‌లో ఉంది. కాబట్టి ఇరాన్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సిబ్బంది కాన్సులర్ యాక్సెస్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఎం.ఆనంద్ ప్రకాశ్ అన్నారు. “జనవరి 10న కాన్సులర్ యాక్సెస్ లభిస్తుందని మేమనుకున్నాం. కానీ ఇరాన్‌లో గందరగోళం కారణంగా అది జరగలేదు. కానీ మేము ప్రయత్నిస్తున్నాం” అని ఆయన అన్నారు. తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రెస్‌నోట్‌లో ఈ పరిణామాలను ధ్రువీకరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌తోనూ, నౌక యాజమాన్య కంపెనీ ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్ఎల్‌సీ తో తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తోంది.
అవి నిరాధారమైన ఆరోపణలు :కంపెనీ యజమాని
ఓడలో ఆరు వేల మెట్రిక్ టన్నుల డీజిల్ అనధికారికమైందనే ఆరోపణ నిరాధారమని ‘ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సి’ కంపెనీ యజమాని జోగిందర్ బరాడ్ అన్నారు. “ఈ నౌక డీజిల్‌ను తీసుకెళ్లదు. ‘వెరీ లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్’ ను తీసుకువెళ్తుంది. ఇది అంతర్జాతీయ జలాల్లో మన ఇతర నౌకలకు ఇంధనం నింపడానికి ఉపయోగపడుతుంది. ఇది సాధారణ ప్రక్రియలో భాగం” అని ఆయన చెప్పారు.
చర్యలు తీసుకుంటున్నాం: కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మీద విజయ్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత జనవరి 15న విచారణ జరిగింది. కోర్టులో ప్రతివాదుల తరపున హాజరైన సీజీఎస్‌సీ నిధి రామన్ “ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో కూడా పిటిషనర్ల ఫిర్యాదు పరిష్కారానికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తుంది” అని చెప్పారు. తదుపరి విచారణ జనవరి 21న జరగాల్సి ఉంది. “ఈ సమస్యను పరిష్కరించేందుకు మేం ఒక లాయర్‌ను ఏర్పాటుచేసుకున్నాం. కానీ ఇరాన్ అంతర్గత పరిస్థితుల కారణంగా సిబ్బందిని లాయర్ కలవలేకపోతున్నారు” అని కంపెనీ యజమాని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: