ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా(Noida)లో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంత ఓ యువ ఇంజినీర్ ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనను యూపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమించింది. నోయిడా అథారిటీ సీఈఓ ఎం లోకేశ్‌పై వేటు వేసింది. అలాగే ఈ ప్రమాదంపై సిట్ విచారణకు ఆదేశించింది. గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా యువరాజ్ మోహతా వర్క్ చేస్తున్నాడు. ఆఫీసు ముగించుకుని ఇంటికి తిరిగొస్తుండగా నోయిడాలోని సెక్టార్-150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద దట్టమైన పొగమంచు కారణంగా వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి, మురుగు కాలువ గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 27 ఏళ్ల యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా మరణించాడు. నీటిలో ఊపిరాడక, అదే సమయంలో గుండెపోటుకు గురై యువరాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Southern Spain: దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

బిల్డర్ కంపెనీలపై నాలెడ్జ్ పార్క్ పోలీసులు కేసు నమోదు
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు నాలుగు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇంజినీర్ యువరాజ్‌ను ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు. కారుతో పాటు నీటిలో మునిగిపోయిన యువకుడి మృతదేహాన్ని మాత్రమే బయటకు తీశారు. మృతుడి తండ్రి రాజ్‌కుమార్ మెహతా ఫిర్యాదు మేరకు ఎంజే విష్‌టౌన్ ప్లానర్ లిమిటెడ్, లోటస్ గ్రీన్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు బిల్డర్ కంపెనీలపై నాలెడ్జ్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 105 (నరహత్య), 106 (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమవ్వడం), 125 (ప్రాణానికి ప్రమాదం కలిగించే చర్య) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. “బిల్డర్ బేస్‌మెంట్ కోసం ఆ ప్రాంతాన్ని తవ్వి స్తంభాలను ఏర్పాటు చేశాడు. కానీ నీరు నిండి ఉండటంతో ఆ స్తంభాలు కనిపించలేదు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి: తండ్రి
టాటా యురేకా పార్క్ సొసైటీలో నివసిస్తున్న 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా గురుగ్రామ్‌లోని తన కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో కూడలి వద్ద దట్టమైన పొగమంచు ఉంది. దీంతో కారు అదుపుతప్పి కాలువ గొడవను ఢీకొట్టి పక్కనే ఉన్న నీటి గుంతలో మునిగిపోయింది. యువకుడు తనను తాను రక్షించుకోవడానికి కారు పైకప్పుపైకి ఎక్కి సమీపంలో ఉన్న వారిని సహాయం కోసం వేడుకున్నాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు.” డీఐజీ రాజీవ్ నారాయణ్ మిశ్రా వెల్లడించారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు యువరాజ్ మోహతా చనిపోయాడని మృతుడి తండ్రి రాజ్‌కుమార్ మెహతా ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: