हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

TSRTC: ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు

Saritha
TSRTC: ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని (TSRTC) ఆర్టీసిలో పనిచేస్తున్న కార్మికులు, ఇప్పటికే రిటైర్ అయిన పెన్షనర్లు ఉద్యమబాట పట్టనున్నారు. ఆర్టీసిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు(మంగళవారం) ఎర్ర బ్యాడ్జిలతో పోరాట దినంగా నిర్వహించాలని ఆర్టీసి జేఏసీ నిర్ణయించింది. గత 8 సంవత్సరాలుగా రిటైర్ అయిన పెన్షనర్లకి సరైన సెటిల్మెంట్ బకాయిలు ఇవ్వక పోవడంతో రేపు(21న బుధవారం) బస్ భవన్ వద్ద బైటాయింపు కార్యక్రమం చేపట్టనున్నట్టు పెన్షనర్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆర్టీసి కార్మికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిజిఎస్ ఆర్టీసి జెఎసి తెలిపింది. ఆర్టిసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేస్తూ ఎర్ర బ్యాడ్జిలతో పోరాట దినం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది.

Read Also: BCTA: ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

TSRTC
RTC workers on the path of movement

బస్ భవన్ ముందు బైఠాయింపు కార్యక్రమం

గత బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని, ఎన్ని మార్లు ఆర్టీసి(TSRTC) కార్మికుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పరిష్కారం చేయటంలో తగిన శ్రద్ధ చూపకపోవడంతో జెఎసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. సాక్షాత్తు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి కార్మిక దినోత్సవమైన మే 1, 2025న స్వయంగా స్పందించి ఆర్టీసి కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నామని బహిరంగంగా చెప్పి 7 నెలలు కావస్తున్నప్పటికీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదన్నారు. అందులో భాగంగా సోమవారం వరకు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన జెఎసి ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులు అందరూ ఎర్ర బ్యాడ్జీలు (రిబ్బన్లు) ధరించి ‘పోరాట దినం’ పాటించాలని జేఏసీ నిర్ణయించింది.

రేపు బస్ భవన్ ముందు పెన్షనర్ల బైఠాయింపు.. తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు గత 8 సంవత్సరాలుగా రిటైర్ అయిన వారికీ సరైన సెటిల్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతోపాటు గత 6 నెలల నుండి ఆర్టీసీ మేనేజ్మెంట్ని కలిసి తమ ఇబ్బందులు తెలియజేసినప్పటికీ వారు స్పందించడం లేదని.. తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమీ లేక రేపు(బుధవారం 21న) బస్ భవన్ వద్ద బైటాయింపు కార్యక్రమం చేపడుతున్నట్టు ఆర్టిసి విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ తెలిపింది. తమ పెండింగ్ బకాయిల సాధన కోసం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బస్ భవన్ ముందు బైఠాయింపు కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 నుండి 6వేల మంది విశ్రాంత ఉద్యోగులందరూ హాజరవుతున్నారని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870