हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

BCTA: ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

Tejaswini Y
BCTA: ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

రాష్ట్రంలోని(Telangana) ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ను జారీ చేయా లని బ్యాక్ వర్డ్ క్లాసెస్ టీచర్స్ అసోసి యేషన్ (BCTA) రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. బిసిటిఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం హైదరాబాద్లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు.

Renu Desai : మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

బీసీ ఉపాధ్యాయుల సమస్యలపై సమావేశం

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాల న్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసి యేట్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

BCTA: Notification should be released for teacher posts
BCTA: Notification should be released for teacher posts

2010 కంటే ముందు నియామకమైన టీచర్లకు టెట్(TET) నుంచి మినహాయింపు ఇవ్వాలి బిసిటిఎ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియం బర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. బిసిటిఏ రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.

బిసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు

పెండింగ్ లో ఉన్న డీఏలను కూడా విడుదల చేయాలన్నారు. బిసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అందుకోసం కావాల్సిన ఉన్నత చదువును చదవడం కోసం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయిం చాలన్నారు. క్రిమిలేయర్
విధానాన్ని ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, అదేవిధంగా బీసీ ఉద్యోగ ఉపాధ్యా యులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కృష్ణన్నని కోరినట్టు తెలిపారు.

సమావేశంలో బిసిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు రాఘవేందర్, కార్యదర్శి ధనంజయ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలం వేణు సుభాష్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రవికుమార్, జనగామ జిల్లా అధ్యక్షులు యాదగిరి, వనపర్తి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, మహేష్ బాలగోపాల్ తోపాటు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారని కృష్ణుడు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870