हिन्दी | Epaper

WPL 2026: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB

Aanusha
WPL 2026: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్‌లో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ విజయం సాధించింది. సోమవారం వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 61 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ ఘన విజయంతో మంధాన సేన ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

Read Also: IND vs NZ: సంజయ్ మంజ్రేకర్‌పై వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు

కీలక భాగస్వామ్యం

బ్యాటింగ్‌లో గౌతమి నాయక్(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 73) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బౌలింగ్‌లో సయాలి సత్ఘరే(3/21) మూడు వికెట్లతో గుజరాత్ జెయింట్స్ పతనాన్ని శాసించింది.టాస్ ఓడిన ఆర్సీబీకి షాకిస్తూ గుజరాత్ జెయింట్స్ బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసినా ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్‌(1)ను మొదటి ఓవర్లోనే రేణుకా సింగ్ వెనక్కి పంపింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ జార్జియా వోల్‌(1)ను కష్వీ గౌతమ్ క్లీన్ బౌల్డ్ చేసింది.

WPL 2026: RCB advances to the playoffs
WPL 2026: RCB advances to the playoffs

దాంతో.. పరుగులకే ఆర్సీబీ విధ్వంసక ప్లేయర్లు డగౌట్ చేరారు. అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన(26), గౌతమీ నాయక్(73) లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. మంధానను ఎల్బీగా ఔట్ చేసిన గార్డ్‌నర్ ఈ ఈ జోడీని గార్డ్‌నర్ విడదీసింది.ఆ తర్వాత రీచా ఘోష్‌(27) జతగా ఆర్సీబీ స్కోర్ బోర్డును నడిపించిన గౌతమి హాఫ్ సెంచరీ సాధించింది. కాసేపటికే రీచా పెద్ద షాట్ ఆడబోయి బౌండరీ వద్ద గార్డ్‌నర్ చేతికి క్యాచ్ ఇచ్చింది.

అనంతరం రాధా యాదవ్‌(17) డెవినె ఓవర్లో భారీ సిక్సర్‌తో స్కోర్ 160 దాటింది. కష్వీ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతినే కవర్స్‌లో రాధ బౌండరీకి పంపింది. రెండో బంతికి ఫోర్ బాదిన తను ఔటయ్యాక వచ్చిన శ్రేయాంక పాటిల్‌(8 నాటౌట్) స్వీప్ షాట్‌తో ఫోర్ సాధించగా 17 రన్స్ వచ్చాయి. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 కొట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

📢 For Advertisement Booking: 98481 12870