చాలామంది థైరాయిడ్ టెస్ట్ రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయన్న కారణంతో వైద్యుల(Medication) సలహా లేకుండానే మందులు వాడటం మానేస్తుంటారు. అయితే ఇది తప్పైన నిర్ణయం అని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో హార్మోన్ స్థాయిలు మందులు క్రమంగా తీసుకోవడం వల్లే నియంత్రణలో ఉంటాయి. మందులు అకస్మాత్తుగా ఆపేస్తే, సమస్య మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Read Also: Healthy Skin:చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

ఎప్పుడు మందులు తగ్గించవచ్చు?
వైద్యుల సూచన ప్రకారం, 12.5 mg లేదా 25 mg తక్కువ డోస్‌లో(Medication) మందులు తీసుకునే వారు కనీసం 6 వారాల తర్వాత మళ్లీ థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో హార్మోన్ లెవల్స్ స్థిరంగా నార్మల్‌గా ఉన్నట్టు తేలితే, డాక్టర్ సూచన మేరకు మందులు క్రమంగా తగ్గించడం లేదా నిలిపివేయడం చేయవచ్చని చెబుతున్నారు.
డాక్టర్ సలహా ఎందుకు ముఖ్యం?
థైరాయిడ్ అనేది దీర్ఘకాలిక సమస్య కావడంతో, స్వయంగా మందులు ఆపడం వల్ల అలసట, బరువు పెరగడం, జుట్టు ఊడటం, గుండె సంబంధిత సమస్యలు మళ్లీ రావచ్చు.
కాబట్టి సమస్య పూర్తిగా నియంత్రణలో ఉందని డాక్టర్ నిర్ధారించిన తర్వాతే మందుల విషయంలో ఎలాంటి మార్పులైనా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: