దేశవ్యాప్తంగా పేరొందిన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తాజాగా 4 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసి, సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 6, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
Read also: TGSRTC: 198 ట్రైనీ ఉద్యోగాలు – రేపే దరఖాస్తులకు చివరి అవకాశం

Jobs at Bank of Baroda
ఎంపిక విధానం మరియు దరఖాస్తు ఫీజు
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ దశల ద్వారా జరుగుతుంది. అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని ఆధారంగా తీసుకొని షార్ట్‌లిస్ట్ చేస్తారు. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.850, SC, ST, PwBD అభ్యర్థులకు రూ.175 మాత్రమే నిర్ణయించారు. ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన https://bankofbaroda.bank.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మంచిది. విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి వంటి అంశాలు సరిపోతేనే అప్లై చేయాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం ఉత్తమం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: