ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు ముగిసినా, కోడి పందేల రూపంలో జరిగిన భారీ ధన ప్రవాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 2,000 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన పందేల రూపంలో భారీగా బెట్టింగ్‌లు జరిగాయి. కోర్టు ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ, సంప్రదాయం పేరుతో అనేక చోట్ల భారీ బరులు (పందేల స్థావరాలు) ఏర్పాటు చేసి బహిరంగంగానే ఈ జూదం సాగింది.
Suryapet accident news : అన్న కళ్ల ముందే చెల్లెలి మృతి, సూర్యాపేటలో షాకింగ్ ప్రమాదం!
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పందేల జోరు పరాకాష్టకు చేరుకుంది. మొత్తం లావాదేవీల్లో కేవలం ఈ రెండు జిల్లాల నుంచే రూ. 1,500 కోట్లకు పైగా పందెం సొమ్ము చేతులు మారినట్లు సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈసారి పందేలు మునుపెన్నడూ లేని విధంగా సాగాయి. కేవలం స్థానికులే కాకుండా, పక్క రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడా భారీ సంఖ్యలో పందెం రాయుళ్లు తరలివచ్చారు. హైదరాబాద్ వంటి నగరాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి ఈ పందేల్లో పాల్గొనడం గమనార్హం.

ఈ సీజన్‌లో గెలుపోటముల స్థాయి ఏ స్థాయిలో ఉందంటే, ఒక వ్యక్తి ఒకే చోట ఏకంగా రూ. 1.53 కోట్లు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం మాత్రమేనని, అనధికారికంగా సాగిన బెట్టింగ్‌ల విలువ ఇంకా ఎక్కువే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పందేల కోసం వినియోగించిన కోళ్ల ధరలు, బరుల వద్ద ఏర్పాటు చేసిన విందులు, విలాసాల కోసం చేసిన ఖర్చు కూడా కోట్లలోనే ఉంది. మొత్తం మీద ఈ సంక్రాంతికి ఏపీలో కోడి పందేలు ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని తలపించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com