మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwari), టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. రోహిత్ పేలవ ఫామ్ గురించి మీడియా ప్రతినిథులు ర్యాన్ టెన్ డస్కాటేను ప్రశ్నించగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో పాటు స్లో పిచ్‌లు కావడంతో ఇబ్బంది పడుతున్నాడని బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాన్ టెన్ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన మనోజ్ తివారి.. ఆటగాళ్లు తక్కువ చేసేలా మాట్లాడకూడదని హితవు పలికాడు.
Read Also: WPL 2026: ముంబై ఇండియన్స్ పై యూపీ ఘన విజయం
తమ ఆటగాడి పట్ల ఇలా మాట్లాడటం సరికాదు
‘ర్యాన్ టెన్ డస్కాటేపై ఉన్న గౌరవంతో ఆయనకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కేకేఆర్ జట్టులో నాలుగేళ్ల పాటు నాకు ఆయన కోచ్‌గా వ్యవహరించాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఆయన రోహిత్ గురించి మాట్లాడేముందు పునరాలోచన చేసుకోవాల్సింది. ఆయన నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ఆయన అంతర్జాతీయ కెరీర్ గణంకాలు చూస్తే….రోహిత్ శర్మ ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సాధించిన దాంట్లో 5 శాతం కూడా ఉండవు.రోహిత్ శర్మ టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.

అలాంటి ఆటగాడి పట్ల టీమిండి మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఉన్న వ్యక్తి తక్కువగా మాట్లాడటం సరికాదు.ఆయనేం ఇంట్లో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. జట్టులో భాగంగా ఉన్న తమ ఆటగాడి పట్ల ఇలా మాట్లాడటం సరికాదు. ఆటగాడి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ ఈ వ్యాఖ్యలపై పునరాలోచన చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని నా అభిప్రాయం.’అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: