हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

JEE Main 2026: జేఈఈ అడ్మిట్ కార్డులు విడుదల

Aanusha
JEE Main 2026: జేఈఈ అడ్మిట్ కార్డులు విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main 2026) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం అధికారికంగా విడుదల చేసింది.పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.ఈ నెల 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పేపర్-1 (బీ.టెక్/బీ.ఇ.) పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఎన్టీఏ ప్రస్తుతం జనవరి 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్థులకు మాత్రమే హాల్ టికెట్లను జారీ చేసింది.

Read Also: Rihan Saha: బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య

JEE admit cards released
JEE admit cards released

ప్రవేశానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి

జనవరి 28, 29 తేదీల్లో పరీక్షలు ఉన్నవారికి అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక పేపర్-2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్ష జనవరి 29న జరగనుంది.పరీక్షలు రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని పరీక్షా కేంద్రం, తేదీ, షిఫ్ట్ వంటి వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఏవైనా సమస్యలుంటే jeemain.nta.nic.in కు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870