స్కిన్ ఆరోగ్యంగా, తాజాగా కనిపించాలంటే శరీరానికి తగినంత నీరు అందడం చాలా అవసరం. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల చర్మం పొడిబారదు, లూజ్ కాకుండా మృదువుగా మెరిసిపోతుంది. అలాగే ముడతలు రావడం కూడా తగ్గుతుంది.

చర్మ పోషణకు విటమిన్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలి. రాజ్మా, అవిసె గింజలు, బాదం, కాజు వంటి డ్రైఫ్రూట్స్ చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. విటమిన్–సి సమృద్ధిగా ఉండే జామకాయ, ఉసిరికాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కొబ్బరి, సోయాబీన్ ఉత్పత్తులు, మొలకలు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవన్నీ క్రమంగా తీసుకుంటే స్కిన్ సహజంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
రోజూ కనీసం 7–8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే చర్మం(Healthy Skin) అలసటగా కనిపించడమే కాకుండా డార్క్ సర్కిల్స్ సమస్య పెరుగుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. అధిక స్ట్రెస్ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మొటిమలు, రాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. ఇది సూర్యకిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మేకప్ ఎక్కువగా వాడే అలవాటు ఉంటే రాత్రి పడుకునే ముందు తప్పకుండా(Healthy Skin) శుభ్రంగా కడగాలి. లేనిపక్షంలో రంధ్రాలు మూసుకుపోయి చర్మ సమస్యలు రావచ్చు.
పొగ త్రాగడం, అధిక మద్యం సేవించడం వంటి అలవాట్లు చర్మాన్ని వేగంగా వృద్ధాప్యానికి గురిచేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మం సహజంగా మెరుస్తుంది. ఈ చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా, బిగుతుగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: