భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ఎరువులు (Fertilisers) పంట దిగుబడికి అత్యంత కీలకం. అయితే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మోనియా, సల్ఫర్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో దేశీయంగా ఎరువుల పరిశ్రమపై భారం పడింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (budget 2026) లో ఎరువుల రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. సబ్సిడీల భారం & సమతుల్య పోషణ ప్రస్తుతం ఎరువుల కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సబ్సిడీ రేట్లు పెరగకపోవడం. రాబోయే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ‘న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ’ (NBS) కింద నిధులను పెంచి, రైతులకు ఎరువుల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
Read Also: GoldLoans: కేంద్ర బడ్జెట్ 2026లో బంగారు రుణాలపై కీలక నిర్ణయాలు?

పన్ను వ్యవస్థలో భారీ మార్పులు..
మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే! నానో ఎరువులు, సేంద్రీయ ఎరువుల వంటి ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా అటు పర్యావరణానికి, ఇటు రైతుకు మేలు జరుగుతుంది. ఎరువుల తయారీలో ‘ఆత్మనిర్భరత’ గత పదేళ్లలో యూరియా ఉత్పత్తిలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించింది. సుమారు 80 లక్షల టన్నుల కొత్త సామర్థ్యాన్ని జోడించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. అయితే, ఫాస్ఫాటిక్ ఎరువుల విషయంలో మనం ఇంకా 30% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితిని మార్చేందుకు బడ్జెట్ లో కొత్త ప్రోత్సాహకాలు ప్రకటించే ఛాన్స్ ఉంది.. కొత్త ఫ్యాక్టరీల స్థాపనకు మూలధన గ్రాంట్లు. పన్ను రాయితీలు, పాత యంత్రాల స్థానంలో కొత్తవి తెచ్చుకోవడానికి రాయితీలు. గ్రీన్ అమ్మోనియా వంటి స్వచ్ఛ ఇంధన ఆధారిత తయారీకి సపోర్ట్. జీఎస్టీ (GST) & పన్ను సంస్కరణలు ఎరువుల రంగం చాలా కాలంగా ‘ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్’ తో ఇబ్బంది పడుతోంది. అంటే ఎరువుల తయారీకి వాడే ముడి పదార్థాలపై ఎక్కువ జీఎస్టీ (GST) ఉండి, తయారైన ఎరువులపై తక్కువ జీఎస్టీ ఉండటం వల్ల తయారీదారులకు ట్యాక్స్ రిఫండ్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: