తెలంగాణ (TG) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:50 గంటలకు బేగంపేట నుండి హెలికాప్టర్ లో అదిలాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ చనాక కొరట పంపు హౌస్ ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా సదర్ మట్ బ్యారేజీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ మినీ స్టేడియంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సా.4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
Read Also: Cynic School : దేశ భద్రత విషయంలో ముందుంటాం – సీఎం రేవంత్

ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించటం ఆనవాయితీ
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలను ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ స్థూపాన్ని సందర్శించిన ఆయన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించడం ఆశలను చిగురింపజేసింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున నేడు సీఎం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: