తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జైలర్ 2’ పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.అతిథి పాత్రల్లో ఎవరు కనిపిస్తారన్న ఉత్కంఠ నెలకొనగా, తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు.జైలర్ 2లో తాను అతిథి పాత్రలో కనిపించనున్నానని విజయ్ సేతుపతి తెలిపారు. రజనీకాంత్ తనకు ఎంతో ఇష్టమైన నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
Read Also: Sharwanand: ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ
అతిథి పాత్రలపై ఆసక్తి
ప్రస్తుతం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే స్క్రిప్ట్‌లలో మాత్రమే విలన్ లేదా అతిథి పాత్రలు చేస్తున్నానని, ఇటీవల విన్న కథలన్నింటిలోనూ ఎక్కువగా నెగెటివ్ పాత్రల కోసమే తనను సంప్రదిస్తున్నారని ఆయన వెల్లడించారు.గతంలో ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ఆయన స్థానంలో సేతుపతి (Vijay Sethupathi) ని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జైలర్ 2లో మోహన్‌లాల్,

షారుక్ ఖాన్, శివరాజ్‌కుమార్ లు కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా అధికారికంగా ప్రకటించడంతో ఈ చిత్రంలోని అతిథి పాత్రలపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: