
సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని అల్వాల్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రూ వ్యాల్యూ కార్ల షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనను గమనించిన షోరూం సిబ్బంది, స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు
ప్రాణనష్టం లేకుండా తప్పించుకున్న ఘటన
సందేశం అందిన వెంటనే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు. రెండు ఫైరింజన్ల(Fire engines) సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతం మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఆస్తి నష్టం ఎంతవరకూ జరిగిందన్న వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: