క్రెడిట్ కార్డుల(Credit Cards) ద్వారా ఏడాదిలో రూ.10 లక్షలకు మించిన లావాదేవీలు జరిగితే ఆదాయపు పన్ను శాఖ పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా, చేసిన ఖర్చులకు తగిన ఆదాయ వనరులను వివరించలేని వారు లేదా తమ ఆదాయానికి మించిన వ్యయాలు చూపిన వారి విషయంలో ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు.
Read Also: UPI safety: పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా?

భారీ క్రెడిట్ కార్డు ఖర్చులు చేస్తున్నారా?
బ్యాంకులు ప్రతి సంవత్సరం నిర్దిష్ట పరిమితికి మించిన లావాదేవీల వివరాలను వార్షిక సమాచార నివేదిక (AIR) రూపంలో ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తాయి. ఈ ఆధారంగా శాఖ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి విచారణ చేపడుతుంది. నోటీసులు అందుకున్న వారు తమ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయానికి సంబంధించిన ఆధారాలు, ఖర్చుల వివరణలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: