హనుమకొండ జిల్లా(Hanumakonda) భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి(Bandi Sanjay) సంజయ్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైనడి గుమ్మడికాయ మొక్కు చెల్లించుకొని మీడియాతో మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చే కొరమీసాలతో కొలువైన దేవుడు వీరభద్రస్వామి అని, ఏ కష్టాలు, కోరికలు ఉన్న స్వామి వారిని మొక్కుకుంటే తీరుతాయన్నారు. సమాజానికి, దేశానికి, ప్రజలకు ద్రోహం చేసే వారిని సంహారం చేసి గుణపాఠం చెప్పి, అలాంటి వారిని మార్చే దేవుడు వీరభద్రస్వామి అన్నారు.
Read Also: Sankranti: భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

సంక్రాంతి సనాతన ధర్మంతో ముడిపడిన పండుగ
రాష్ట్రంలో ,దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని నిండు మనసుతో స్వామి వారిని మొక్కుతున్ననన్నారు. ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా దేశం, సమాజం మంచిగా ఉండాలని ఆకాంక్షించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ప్రధాని మోడీకి స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని కోరారు. అగ్ర రాజ్యాల్లో భారత దేశాన్ని చేర్చాలని ప్రయత్నం చేస్తున్న ప్రధానికి స్వామి వారు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలన్నారు. స్వామివారి ఆశీస్సులతో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నారు.
వీరభద్ర స్వామి ఈ ప్రాంతానికే దేవుడు కాదని తెలంగాణ, ఆంధ్రా, ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తారన్నారు. దేవాలయంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి అంటే పంటల పండుగే కాదు సనాతాన ధర్మంతో ముడిపడిన పండుగ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు పెట్టిన వారికి, గెలిచిన వారికి, పాల్గొన్న వారికి అభినందలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: