हिन्दी | Epaper

Khameni: ఇరాన్‌లో నిరసనకారులకు ఉరిశిక్ష ఏర్పాట్లు

Vanipushpa
Khameni: ఇరాన్‌లో నిరసనకారులకు ఉరిశిక్ష ఏర్పాట్లు

ఇరాన్‌లో గత కొన్ని వారాలుగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Khameni)కి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు(Iran to hang) తీసుకుంటోంది. ఈక్రమంలో ఆందోళనల్లో పాల్గొన్న ఎర్ఫాన్ సుల్తానీ(Erfan Soltani)(26) అనే యువకుడిని ఉరితీసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుత నిరసనల నేపథ్యంలో అమలు చేయనున్న మొదటి ఉరిశిక్ష ఇదే కావడం గమనార్హం. టెహ్రాన్ శివార్లలోని ఫర్దిస్ నివాసి అయిన ఎర్ఫాన్ సుల్తానీని జనవరి 8న భద్రతా దళాలు అరెస్టు చేశాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఖమేనీ వ్యతిరేక ప్రదర్శన(anti-Khamenei protests)ల్లో చురుగ్గా పాల్గొన్నారనేది అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే, అంటే జనవరి 11న అతని కుటుంబ సభ్యులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఎర్ఫాన్‌కు మరణశిక్ష విధించినట్లు, బుధవారం (జనవరి 14) నాడు ఉరితీత ఉంటుందని సమాచారం అందించారు.

Read Also: US: పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Khameni: ఇరాన్‌లో నిరసనకారులకు ఉరిశిక్షకు ఏర్పాట్లు
Khameni: ఇరాన్‌లో నిరసనకారులకు ఉరిశిక్షకు ఏర్పాట్లు

మరణశిక్షపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం

మరణశిక్ష ఖరారైన తర్వాత, కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే అతనిని కలిసేందుకు కుటుంబానికి అనుమతినిచ్చారు. ఎర్ఫాన్ సోదరి న్యాయవాది అయినప్పటికీ, కనీసం కేసు ఫైల్ చూసేందుకు కూడా అధికారుల ఆమెను అనుమతించకపోవడం గమనార్హం. ఇరాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 2025 డిసెంబర్ చివరిలో ప్రారంభమైన ఈ నిరసనలు, క్రమంగా ఖమేనీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండ్‌గా మారాయి. నిరసనకారులు ఖమేనీ ఫోటోలను తగలబెడుతూ, “సర్వాధికారికి మరణం” అంటూ నినదిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో వందలాది మంది మరణించగా, వేల సంఖ్యలో ప్రజలు జైలు పాలయ్యారు. ఎర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణశిక్షపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తపాలా శాఖ GDS ఫలితాలు విడుదల

తపాలా శాఖ GDS ఫలితాలు విడుదల

ఇరాన్‌లో మళ్లీ భూకంపం

ఇరాన్‌లో మళ్లీ భూకంపం

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. 12న ఆఫీస్ ఓపెనింగ్

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. 12న ఆఫీస్ ఓపెనింగ్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

📢 For Advertisement Booking: 98481 12870