ఇండియన్ నేవీ(Indian Navy) జనవరి 2027లో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ కోర్సుకు సంబంధించి నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నియామకాలకు అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 260 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.
Read also: NEET UG 2026: నీట్ యూజీ సిలబస్ విడుదల

అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులను బట్టి బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతను కనీసం 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు కేరళ రాష్ట్రంలోని ఎజిమల(Ezimala Naval Academy)లో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో శిక్షణ అందజేయబడుతుంది. శిక్షణ పూర్తయ్యాక అధికారికంగా సేవల్లో చేరే అభ్యర్థులకు ప్రారంభ వేతనంగా నెలకు సుమారు రూ.1,25,000 చెల్లించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: