హైదరాబాద్ : తెలంగాణ(Telangana) ప్రభుత్వ ఖజానాకు వేస్ అండ్ మీన్స్ ఆడ్వాన్స్ లిమిట్ను పెంచుతూ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అదనంగా రూ.2.407 కోట్లకు పెంచుతూ రాష్ట్ర సర్కార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ అధికారవర్గాల సమాచారం మేరకు స్వల్పకాలిక నగడు నిర్వహణలో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం కల్పిస్తూ ఈ నెల 9వ తేదీ నుండి వేస్ అండ్ మీన్స్ ఆడ్వాన్స్ (WMA), తాత్కాలిక రుణం పరిమితిని రూ.2.407 కోట్లకు పెంచింది.
Read also: Oslo: నోబెల్ మరొకరికి అంకితం చేయడం కుదరదు: కమిటీ

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం డబ్ల్యూఎంఎ పరిమితిని ఇప్పటికే ఉన్న రూ. 60.118 కోట్ల నుండి రూ. 61,008 కోట్లకు సవరించాలన్న ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ సర్కార్కు కూడా ఈ పెంపు జరిగింది. ఫలితంగా, తెలంగాణ యొక్క వ్యక్తిగత పరిమితిని ఇప్పటి వరకూ రూ.2,300 కోట్లు ఉండగా, దాన్ని తాజాగా రూ.2,407 కోట్లకు పెంచింది. దీనివల్ల ఆదాయాలు మరియు చెల్లింపులు మధ్య తాత్కాలిక వ్యత్యాసం ఉన్న సమయాల్లో తెలంగాణ బజానా నుండి తక్షణ ఖర్చుల అవసరాలను తీర్చగల సామర్థ్యం బలవడుతుంది.
ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(Ways and Means Advance) అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వల్పకాలిక నగదు కొరతను అధిగమించడానికి ఆర్బిఐ తాత్కాలిక పూడ్చడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ ఇవి దీర్ఘకాలిక ఆర్థిక సహాయ యంత్రాంగంగా ఉపయోగపడటానికి ఉద్దేశించినవి కావు, డబ్ల్యూఎంఏ కింద తీసుకున్న మొత్తాన్ని 90 రోజులలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గాను వసూలు చేసే వడ్డీ ప్రస్తుత రెపో రేటుకు అనుగుణంగా ఉంటుంది. ఈ సౌకర్యం ప్రభుత్వాలు నగడు కొరత కారణంగా నిత్య వ్యయాలలో అంతరాయాలను నివారించి, అవసరమైన సేవల సజావుగా నిర్వహణను కొనసాగించడానికి వీలు కల్పించనుంది. దుజాలుగా అందించే ఆర్థిక సాయం. ఈ ఆధ్వాన్స్ నగదు రాబడి, ఖర్చల మధ్య సమయ వ్యత్యాసాలను కాగా వేస్ అండ్ మీన్స్ ఆడ్వాన్స్ లపై ఆధారపడటాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాగ్) ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.
ఆదాయం మరియు వ్యయం మధ్య స్వల్పకాలిక అంతరాలను పూడ్చడానికి రాష్ట్రం రిజర్వ్ బ్యంక్ నుండి తీసుకునే ఆధ్వాన్స్ లపై ఎక్కువుగా ఆధారపడుతోందని పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రుణాలకు సంబంధించినలో వరిమితి గణనీయమైన వృద్ధిని సాధించింది. 2014లో ఈ పరిమితి రూ.550 కోట్లుగా ఉండగా, రాష్ట్ర ఆదాయ ప్రొఫైల్, మూలధన వ్యయం ఆధారంగా 2016లో దీనిని రూ.1,080 కోట్లకు రిజర్వ్ బ్యాంక్ పెంచింది. ఇది దాదాపు 96.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. 2020లో దీనిని మరింతగా రూ. 1,728 కోట్లకు, ఆ తర్వాత 2026లో ప్రస్తుత స్థాయి అయిన రూ.2,407 కోట్లకు చేరుకుంది. ఈ స్థిరమైన పెరుగుదల రాష్ట్ర ఆర్ధిక కార్యకలాపాల విస్తరణను మరియు నగదు ప్రచావా హెచ్చుతగ్గులను నిర్వహించడానికి ద్రవ్య మద్దతు అవసరం పెరుగుతున్న విషయాన్ని నొక్కి చెబుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: