
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్(Daggupati Prasad) అనుచరులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. నగరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని రూ.10 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: CM Chandrababu: నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు
ఈ డిమాండ్‌కు నిర్వాహకుడు ఫకృద్దీన్ అంగీకరించకపోవడంతో, కొందరు అనుచరులు మద్యం సేవించి అక్కడ హంగామా సృష్టించారని తెలుస్తోంది. పరిస్థితి అదుపుతప్పి నిర్వాహకుడిపై దాడి వరకు వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీనిపై బాధితుడు ఫకృద్దీన్ జిల్లా ఎస్పీ జగదీశ్‌ను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. సంఘటనకు(Daggupati Prasad) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ ప్రారంభించగా, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఎమ్మెల్యే పేరు వరుసగా వివాదాల్లో వినిపించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: