మన శరీరంలో నిరంతరం పని చేసే ముఖ్యమైన అవయవం గుండె. గుండె ఆరోగ్యం బాగుంటేనే జీవితం సజావుగా సాగుతుంది. ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండె సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఒత్తిడి, అసమతుల్యమైన ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం. ఈ అలవాట్లు గుండె (Heart) నాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయి.
Read also: Health: సహజ ఆరోగ్యకర చర్మం కోసం రోజూ కలబంద రసం

Health Tips
గుండె సమస్యలను దూరం చేసుకోవడం మన చేతిలోనే ఉంది. లైఫ్స్టైల్లో చిన్న మార్పులు, సరైన డైట్ పాటిస్తే గుండె పనితీరును మెరుగుపరచవచ్చు. ముఖ్యంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం గుండెను రక్షిస్తుంది. రెగ్యులర్‌గా సరైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ అటాక్, బీపీ, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు
- ఓట్స్: ఫైబర్ అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
- బాదం, ఆక్రోట్స్, పల్లీలు: హెల్దీ ఫ్యాట్స్‌తో గుండె నాళాలను కాపాడతాయి
- చేపలు: ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌తో హార్ట్ రిస్క్‌ను తగ్గిస్తాయి
- బెర్రీస్: యాంటీ ఆక్సిడెంట్స్‌తో గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి
- ఆకుకూరలు: ఫైబర్, ఐరన్‌తో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి
- ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె: గుండెకు హాని కలగకుండా కాపాడతాయి
- టమాటలు: లైకోపిన్‌తో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి
- డార్క్ చాక్లెట్: రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది (పరిమితంగా)
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: