అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయన మరోసారి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన పోస్ట్ చేశారు. ఆయన తనను తాను వెనిజులా “యాక్టింగ్ ప్రెసిడెంట్” అని చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. ట్రంప్ అధికారిక ఫోటోతో పాటు ఉన్న ఆ పోస్ట్‌లో, తాను ప్రస్తుతం వెనిజులా “యాక్టింగ్ ప్రెసిడెంట్” అని పేర్కొన్నారు. జనవరి 20, 2025న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తనను తాను యునైటెడ్ స్టేట్స్ యొక్క 45వ మరియు 47వ అధ్యక్షుడిగా కూడా పరిచయం చేసుకుంటున్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. వికీపీడియా పేజీని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్ ఫొటో అది. అందులో ట్రంప్ (Donald Trump) ఫొటో కింద.. ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also: Russo-Ukrainian War : ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో దాడి
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో ఇటీవల వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులకు దిగిన సంగతి తెలిసిందే. రాజధాని కారకాస్‌పై విరుచుకుపడిన అగ్రరాజ్య బలగాలు.. ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను నిర్బంధించి అమెరికాకు తరలించాయి. ఇప్పుడు న్యూయార్క్‌లో నిర్బంధంలో ఉన్నారు, నార్కో-టెర్రరిజం ఆరోపణలపై న్యాయపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల అనంతరం వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టారు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని వెనెజువెలా రక్షణమంత్రి వెల్లడించారు. అయితే వెనెజువెలా పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆ దేశ విపక్ష నేత, నోబెల్ పురస్కార గ్రహీత మచాడోను ఎన్నుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆమెకు బాధ్యతలు ఇచ్చేందుకు ట్రంప్ విముఖత చూపించడం గమనార్హం. మచాడోకు ప్రజల్లో అంత మద్దతు లేదని అమెరికా అధ్యక్షుడు ఇటీవల అన్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: