हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Chittoor: వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.

Pooja
Chittoor: వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన  జిల్లా పోలీసులు.

చిత్తూరు జిల్లా (Chittoor)రేనాటి సమరయోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ దేవదాస్ జిల్లా సాయుధ దళం కార్యాలయములో ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Read Also: AP: ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ… వడ్డే ఓబన్న బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్‌ చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు. జీవితంలోను, పోరాటంలోను, మరణంలోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న . నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఓబన్న జనవరి 11న జన్మించారు.

1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్య్ర యుద్ధం అంటారని, కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని తెలిపారు. శిస్తుల వసూలు విషయంలో ఈస్టిండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్ళకు మధ్య మొదలైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి. ఆ పోరులో సైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న వీరోచిత పాత్రను పోషించారు. 10 వేల మందితో వడ్డెరలు, బోయలు, చెంచులతో సంచార తెగల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడారని తెలిపారు.

అలాగే వడ్డే ఓబన్న ధైర్యసాహసాలు,(Chittoor) కర్తవ్యనిష్ఠ, ప్రజల పట్ల సేవాభావం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీసు సిబ్బందికి ఆదర్శప్రాయమని అన్నారు. చట్ట పరిరక్షణ, ప్రజాసేవ, న్యాయం కోసం పనిచేసే ప్రతి పోలీసు కూడా వడ్డే ఓబన్న ని స్ఫూర్తిగా తీసుకొని కర్తవ్య నిర్వహణలో మరింత అంకితభావం చూపాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. అడ్మిన్ సుధాకర్, ఆర్.ఐ. ఎం టి ఓ వీరేశ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870