లిబియా రాజధాని ట్రిపోలీలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో Social media వైరల్‌గా మారింది. 2010లో ఆర్డర్ చేసిన నోకియా మొబైల్ ఫోన్లు, ఏకంగా 16 ఏళ్ల తర్వాత డెలివరీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో మార్కెట్‌ను శాసించిన బటన్ ఫోన్లు, బాక్సులలో కొత్తవిలా బయటకు రావడంతో ఈ ఘటన ప్రత్యేక ఆసక్తిని రేపింది. ఆర్డర్ పెట్టిన దుకాణదారుడు ఫోన్లు అందుకున్న క్షణంలో నవ్వు ఆపుకోలేకపోయిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Read also: Firing in US : అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి
ఇవి ఫోన్లా? లేక చరిత్రకు చెందిన కళాఖండాలా?
ఈ అసాధారణ ఆలస్యానికి ప్రధాన కారణం లిబియాలో 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధమే. రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడం, కస్టమ్స్ కార్యాలయాలు మూతపడటం వల్ల ఈ షిప్‌మెంట్ గిడ్డంగుల్లోనే మగ్గిపోయింది. విశేషం ఏమిటంటే, ఫోన్లు పంపిన ప్రాంతం, అందుకున్న దుకాణం రెండూ ట్రిపోలీలోనే ఉండగా, కొన్ని కిలోమీటర్ల దూరానికే డెలివరీకి 16 ఏళ్లు పట్టింది. ఇది అంతర్యుద్ధం సామాన్య జీవితంపై ఎంతటి ప్రభావం చూపిందో స్పష్టంగా చూపిస్తోంది.
ఈ షిప్‌మెంట్‌లో అప్పట్లో ప్రతిష్ఠకు చిహ్నంగా నిలిచిన నోకియా మ్యూజిక్ ఎడిషన్ ఫోన్లు, నోకియా కమ్యూనికేటర్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఫోన్లను అన్‌బాక్స్ చేస్తూ, “ఇవి ఫోన్లా? లేక చరిత్రకు చెందిన కళాఖండాలా?” అంటూ దుకాణదారుడు చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. కొందరు ఈ పాత ఫోన్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని, మరికొందరు ట్రాకింగ్ లేని ఫోన్లు కావడంతో వీటి విలువ మరింత పెరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: