తెలంగాణ (TG) లో సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. పుష్ప-2 తర్వాత ఎప్పుడూ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానమిస్తూ,
Read also: Drugs: సూత్రధారులే మూలం

జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదు
తాను సినిమా పరిశ్రమ వ్యవహారాలను పట్టించుకోవడం మానివేశానని ఆయన అన్నారు. టిక్కెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అర్ధరాత్రి సమయంలో జీవో వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై విధంగా స్పందించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: