Donald Trump statement : వెనెజువెలా మాజీ అధ్యక్షుడు Nicolás Maduro ను అమెరికా బలగాలు అనూహ్యంగా అరెస్ట్ చేయడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత వారం కారకాస్‌లోని ఆయన నివాసంపై మెరుపుదాడి చేసిన అమెరికా దళాలు మదురోను అదుపులోకి తీసుకుని న్యూయార్క్ జైలుకు తరలించినట్లు సమాచారం. ఈ పరిణామం అమెరికా–రష్యా సంబంధాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.
మదురో అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy, “ఒక నియంతతో ఇలాగే వ్యవహరించాలి. తదుపరి ఎవరి వంతు అన్నది అమెరికాకు బాగా తెలుసు” అంటూ రష్యా అధ్యక్షుడు Vladimir Putin ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను కూడా అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై అమెరికా (Donald Trump statement) అధ్యక్షుడు Donald Trump స్పందిస్తూ జెలెన్‌స్కీ అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. పుతిన్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. “పుతిన్ విషయంలో నాకు నిరాశ ఉంది. అయినప్పటికీ ఆయనతో మాకు ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన్ను బలవంతంగా పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు.
Vijay: ‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇప్పటివరకు ముగియకపోవడంపై విచారం వ్యక్తం చేసిన ట్రంప్, తాను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని గుర్తుచేశారు. “గత నెలలోనే 31 వేల మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది రష్యా సైనికులే. రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను” అని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత వారం అర్ధరాత్రి Caracas నగరంపై అమెరికా యుద్ధ విమానాలు ఆకస్మిక వైమానిక దాడులు జరిపాయని సమాచారం. ఆ తర్వాత రంగంలోకి దిగిన అమెరికా రహస్య ప్రత్యేక దళం ‘డెల్టా ఫోర్స్’ నిద్రలో ఉన్న మదురోను అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయన్ను ‘యూఎస్ఎస్ జిమా’ అనే భారీ యుద్ధ నౌక ద్వారా న్యూయార్క్‌కు తరలించినట్లు కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు Delcy Rodríguez వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా, ఆ దేశ చమురు ఎగుమతులపై పట్టు సాధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: