Jana Nayagan censor issue : కోలీవుడ్ స్టార్ హీరో Vijay అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన తాజా చిత్రం Jana Nayagan కు సెన్సార్ క్లియరెన్స్ విషయంలో ఊహించని ఆటంకం ఏర్పడింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెన్సార్ బోర్డుకు అనుకూలంగా Madras High Court సింగిల్ బెంచ్ ఇటీవల ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందం, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?
అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
డివిజన్ బెంచ్ తీసుకున్న ఈ నిర్ణయంతో (Jana Nayagan censor issue) జన నాయగన్ సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. జనవరి 21 వరకు సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు లేవని సమాచారం. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: