
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదంపై తెలంగాణ (TG) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి అంశం అత్యంత సున్నితమైనదని, దీనిని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం తగదని ఆయన స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, సమస్యల పరిష్కారానికి సంభాషణే సరైన మార్గమని అన్నారు.
Read Also: Siddipet: హస్తం గుర్తు.. రైతుల పాలిట మొండి హస్తం
నీటి విషయంలో పంచాయితీ కంటే పరిష్కారానికే నేను ఇష్టపడతా. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన మా ప్రాజెక్టుకు పక్క రాష్ట్ర సీఎం అడ్డుపడొద్దు. మేము వివాదం కోరుకోవడం లేదు. శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాం. మీకు పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే తెలంగాణకు నీళ్లు కావాలి అంటాను’ అని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: