Dhurandhar Movie Ban: భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ సినిమాపై పశ్చిమాసియా(West Asia) దేశాల్లో నిషేధం విధించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.
Read Also: Sankranthi Movies: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

భారత సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన సినిమాను ఈ విధంగా నిషేధించడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన అసోసియేషన్, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నిషేధాన్ని ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలని కోరింది.
విదేశాల్లో భారతీయ సినిమాలకు ఉన్న ప్రేక్షక ఆదరణను దృష్టిలో పెట్టుకుంటే, ఈ నిషేధం సినిమా పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండటంతో, అక్కడ ప్రదర్శన నిలిపివేయడం ఆర్థికంగా కూడా నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. సెన్సార్(Sensor board) అనుమతి పొందిన చిత్రం అంతర్జాతీయంగా నిషేధానికి గురవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: