Food safety : సిద్దిపేట, సురక్షితమైన ఆహారం ప్రజలకు అందేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహారం అందించాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో పనిచేసే వంట సిబ్బంది, చిన్న పిల్లలకు ఆహారం అందించే అంగన్వాడీ కార్యకర్తలకు దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
ఆహార తయారీ, నిల్వ, సరఫరా ప్రక్రియల్లో (Food safety) పరిశుభ్రత పాటించడంతో పాటు నిబంధనల అమలుపై సంబంధిత శాఖలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఫుడ్ సేఫ్టీ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, హుస్నాబాద్ ఆర్టీవో రామ్మూర్తి, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి పి. అమృత శ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, ఫుడ్ సేఫ్టీ అధికారి జయరాం, జిల్లా సంక్షేమ అధికారి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: