విజయవాడ : ఉత్తమ, నైతిక విలువలతో కూడిన విద్య ఇప్పటి సమకాలీన సామాజిక వ్యవస్థకు అత్యంత అవసరమని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. గ్రామీణ ప్రాంతాలు విద్యాపరంగా అభివృద్ధి సాధించినప్పుడే సుస్ధిర ప్రగతి సాధ్యమన్నారు. విద్యను అభ్యసించడానికి పడిన కష్టాలు గుర్తెరిగిన ఉపాధ్యాయులే మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కాకతీయ, అపోలో విద్యాసంస్థల 40వ దశాబ్ది ఉత్సవాలను ఆయన విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతాంగం అధికంగా ఉండే ప్రాంతాల్లో విద్యావ్యాప్తి అవసరమన్నారు. దీని వలన ఉన్నత స్థాయి ఫలితాలు సాధించవచ్చునన్నారు.
Read also: Chandrababu: నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

Education based on moral values is extremely important
అత్యంత విలువలతో కూడిన బోధనను అందించినందువలనే కాకతీయ- అపోలో పాఠశాల విద్యార్ధులు ప్రపంచంలోని అన్ని కీలక దేశాల్లో అడుగుపెట్టి, వారి అభిరుచికి అనుగుణమైన రంగాల్లో స్థిరపడ్డారన్నారు. శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఈ పాఠశాల విద్యార్థిని కావడాన్ని బట్టే ఇక్కడ మానవీయ విలువలుతో పాటు ప్రశ్నించే తత్వాన్ని పెంచుతారని అర్ధమైందన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యాలయం ఏటా వందలాది మంది విద్యార్థుల టెన్త్ పరీక్షలకు పంపి, రాష్ట్రస్థాయిలో ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు కాపా రవీంద్ర బాబు, పాఠశాల పూర్వ విద్యార్ధిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కెవిఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ కేజీ తిలక్ తదితరులు మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దిన ఘనత కాకతీయ విద్యాసంస్థలు దక్కింది.
రైతు కుటుంబాల పిల్లలకు విద్యే బలం
భారత దేశంలో కాకుండా ప్రపంచ నలుమూలల అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా ఎన్నో దేశాల్లో మా విద్యార్థులు స్థిరపడ్డారు. ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, చలనచిత్ర రంగంలోను. రాజకీయాల్లో రాణిస్తున్నారన్నారు. వ్యవస్థాపకులు రవీంద్రనాధ్, భారతీ నాధ్ మాట్లాడుతూ. కాకతీయ విద్యాసంస్థలు ఇంతా అభివృద్ధి చెందింది. ఉపాధ్యాయులకు కృషి ప్రాధాన్యత ఎంతో ఉంది. 2019 కాకతీయ విద్యాసంస్థలను విద్యార్థుల తల్లిదండ్రుల మేరకు సిబిఎస్ ప్రవేశం పెట్టాడం జరిగింది. కుటుంబం కాకతీయ అపోలో సంస్థల విద్యార్థులు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కాకతీయ విద్యాసంస్థల్లో చదవే పిల్లలు అందరూ రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వారు ఉన్నారు. కాకతీయ అపోలో విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఎక్కడ ఉన్న ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. స్కూల్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించిన ఆటలు పాటలు. సంప్రదాయక నృత్యాలు, ఆధునీక డాన్సులు, నాటకాలు ఎంతగానో అలరించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: