తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో గత నెల డిసెంబర్ 30న ప్రారంభమైన పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు (నేటి) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ముగియనున్నాయి. మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేసిన టీటీడీ (TTD), మిగిలిన ఏడు రోజులకు నేరుగా వచ్చే సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. పరిమిత సంఖ్యలో శ్రీవాణి, రూ.300 టికెట్లు, వీవీఐపీల బ్రేక్, స్థానికులకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు జారీ చేశారు.
Read Also: Andhra Pradesh: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం

పకడ్బందీగా ఏర్పాట్లు
నిన్న ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, నేడు కూడా అదే స్థాయిలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం టీటీడీ (TTD) యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది. ఏఐ (Al) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తూ,
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు పంపిణీ చేశారు. భక్తుల భద్రత, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: