हिन्दी | Epaper
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Ashes series: సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

Anusha
Ashes series: సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

యాషెస్ సిరీస్‌ (Ashes series) లో భాగంగా, సిడ్నీ వేదిక‌గా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, 5 టెస్టుల సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. 302/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో 40 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సెంచరీతో దుమ్మురేపిన జాకబ్ బేతెల్ 150 కూడా సాధించాడు. 265 బంతులు ఆడిన బేతెల్ 15 ఫోర్లతో 154 పరుగులు చేసి అవుటయ్యాడు. బేతెల్ అవుటైన తర్వాత జోష్ టంగ్, మాథ్యూ పాట్స్ ఆఖరి వికెట్‌కు 14 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Read Also: Boxing: క్వార్టర్ ఫైనల్స్‌కు నిఖత్ జరీన్

ట్రావిస్ హెడ్, జేక్ వెధరాల్డ్ భాగస్వామ్యం

మిచెల్ స్ట్కార్క్, వెబ్‌స్టర్ చెరో మూడు వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఆధిక్యం దక్కడంతో.. రెండో ఇన్నింగ్స్‌లో విజయానికి కేవలం 159 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. దాంతో ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, జేక్ వెధరాల్డ్ మంచి భాగస్వామ్యం అందించారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో విజయం మరింత సులువు అయింది. ఈ ఇద్దరు అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు పడటం మొదలయ్యాయి.

Ashes series: Australia wins the Sydney Test
Ashes series: Australia wins the Sydney Test

విజయానికి 39 పరుగులు కావాల్సిన సమయంలో ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్ ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ని ముగించారు. ఈ టెస్టులో ఇంగ్లండ్ తరఫున జో రూట్, జాకబ్ బేతెల్ సెంచరీలు చేయగా.. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలు బాదారు. మొదటి మూడు టెస్టుల్లో వరుసగా విజయం సాధించిన ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో ఓడిపోయింది. ఇక చివరిదయిన సిడ్నీ టెస్టులో విజయం సాధించి 4 -1తో సిరీస్ సొంతం చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870