బంగాళాఖాతంలో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాలలో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్

అంచనా
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని శ్రీలంక సమీపంలో మంగళవారం రోజున అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారుతుందంటున్న వాతావరణ శాఖ అధికారులు..
తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. (Weather) ఫలితంగా రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్తున్నారు. అయితే అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: