हिन्दी | Epaper

AP: కనుమ సందర్భంగా ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

Anusha
AP: కనుమ సందర్భంగా ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

ఆంధ్రప్రదేశ్ (AP) లో ఈ నెల 16న కనుమ పండుగ సందర్భంగా బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: Virus: ప్రమాదపు అంచుల్లో వేప

AP: Banks to remain closed on 16th of this month on the occasion of the Pass
AP: Banks to remain closed on 16th of this month on the occasion of the Pass

డిమాండ్ల సాధన కోసం

ఈ సెలవు ప్రకటనతో వరుసగా పండుగ సెలవులు రావడంతో సామాన్య ప్రజలు తమ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు వారంలో 5 వర్కింగ్‌ డేస్‌ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ రోజున బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు పోరాట బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870