మలయాళ సినీ మేకర్స్ థ్రిల్లర్ జోనర్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా అడవి నేపథ్య కథలను ఆసక్తికరంగా , ఉత్కంఠభరితంగా తెరపై ఆవిష్కరించడంలో వారు ముందుంటారు. అదే కోవలోకి వచ్చే తాజా చిత్రం (Eko Movie) ‘ఎకో’. (Netflix) జయరామ్ విపిన్ అగ్నిహోత్రి నిర్మించిన ఈ సినిమాకు దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా కథ ఏమిటంటే…
Read also: Rukmini Vasanth: ‘టాక్సిక్’ నుంచి రుక్కు ఫస్ట్ లుక్ రిలీజ్

కథ
(Eko Movie) కేరళ–తమిళనాడు–కర్ణాటక సరిహద్దులను తాకుతూ విస్తరించిన దట్టమైన అడవీ ప్రాంతంలో కురియాచన్ (సౌరభ్ సచ్‌దేవ్)కు 150 ఎకరాల ఎస్టేట్ ఉంటుంది. (Eko Movie) ప్రకృతి ప్రేమికుడైన కురియాచన్ తన ఎస్టేట్‌ను ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. మలేసియాలో పనిచేసిన సమయంలో అక్కడి ప్రత్యేక బ్రీడ్ కుక్కల పనితీరుతో ఆకర్షితుడై, వాటిని తన ఎస్టేట్‌లో పెంచుతుంటాడు.
ఆ కుక్కలకు ఇచ్చిన కఠినమైన శిక్షణ కారణంగా, కురియాచన్ అనుమతి లేకుండా ఆ ఎస్టేట్‌లోకి ఎవ్వరూ అడుగుపెట్టలేరు. అయితే ఒక క్రిమినల్ కేసుతో సంబంధం ఉందని చెబుతూ కురియాచన్ అకస్మాత్తుగా అదృశ్యమై సంవత్సరాలు గడుస్తాయి. భర్త కోసం ఎదురు చూస్తూ అతని భార్య మిలాతియా (బియానా మోమిన్) ఎస్టేట్‌లోని కొండపై ఒంటరిగా జీవిస్తుంది. ఆమె బాగోగులు చూసుకోవడానికి పిల్లలు పీయూస్ (సందీప్ ప్రదీప్)ను నియమిస్తారు.
కురియాచన్ గుట్టును ఛేదించేందుకు అతని స్నేహితుడు మోహన్ పోతన్ (వినీత్) అడవిలోకి వస్తాడు. కానీ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. ఆ తర్వాత నేవీ అధికారిగా ఉన్న వ్యక్తి (నరేన్) కూడా కురియాచన్ గురించి తెలుసుకునేందుకు అడవిలోకి అడుగుపెడతాడు. కురియాచన్ ఎవరు? అతనికి ఏమైంది? అతని కోసం ఎందరు గాలిస్తున్నారు? పీయూస్ అసలు నేపథ్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.
పనితీరు
ఈ సినిమాలో కథకన్నా లొకేషన్లే ఎక్కువగా డామినేట్ చేస్తాయి. నెమ్మదిగా సాగుతున్న కథ అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను అలసటకు గురి కాకుండా చేస్తాయి. కొన్ని కుక్కల సన్నివేశాలు మాత్రం గతంలో వచ్చిన టీవీ సీరియల్స్‌ను గుర్తుకు తెస్తాయి.
ముగింపు
కథ పరంగా చూస్తే ఇది సాధారణమైన మిస్టరీ థ్రిల్లర్. కానీ అడవి, కొండలు, అక్కడి గ్రామ జీవితం, రహస్యాలను ఛేదించాలనే ప్రయత్నాలు సినిమాకు కావాల్సిన ఉత్కంఠను అందించాయి. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ పాత్రలతో చేసిన ఒక నిశ్శబ్ద ప్రయోగంలా ఈ చిత్రం అనిపిస్తుంది.
అందమైన చిత్రాలతో కూడిన కథల పుస్తకం చదువుతున్న అనుభూతినే ‘ఎకో’ ప్రేక్షకులకు ఇస్తుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: