ఏపీ ప్రకాశం జిల్లా(Prakasam crime) వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం విషాదకర ఘటన జరిగింది. నాగజ్యోతి అనే వివాహిత అనుమానాస్పదంగా హత్యకు గురైంది. సమాచారం ప్రకారం, అద్దంకికి చెందిన సీనావలి అనే వ్యక్తితో నాగజ్యోతికి కొంతకాలంగా వివాహేతర సంబంధం(extramarital affair) ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

భయంతో సీనావలి విషం తాగి ఆత్మహత్య
ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ కాస్తా అదుపుతప్పడంతో ఆవేశానికి లోనైన సీనావలి నాగజ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం గ్రామస్థులకు విషయం తెలిసిపోతుందన్న భయంతో సీనావలి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
పరిస్థితి విషమించడంతో స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సీనావలి కూడా మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతురాలైన నాగజ్యోతికి భర్తతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉండగా, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: