हिन्दी | Epaper

Venkaiah Naidu: ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి విమర్శలు

Anusha
Venkaiah Naidu: ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి విమర్శలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu).. ఉచిత ప‌థ‌కాల‌పై మ‌రోసారి కామెంట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, యూపీలలో అమలవుతున్న ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించారు. ఈ పథకాల వల్ల ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. పని చేసే శక్తి ఉన్నవారిని కూడా ఉచితాలు పాడుచేస్తున్నాయని, వెంటనే వీటిని ఆపాలని గుంటూరు పర్యటనలో కోరారు.

Read also: AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్

విద్య, వైద్యం మినహా ఇతర ఉచితాలను ఆపివేయాలి

విద్య, వైద్యం మినహా ఇతర ఉచితాలను నిలిపివేయాలని చెప్పారు. ఉచిత ప‌థ‌కాల‌ను త‌క్ష‌ణ‌మే ఆపేస్తే, రెండు తెలుగు రాష్ట్రాల‌కు మ‌రింత మంచిద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ఆర్థిక లోటును భ‌ర్తీ చేసుకునే అవ‌కాశం రెండు తెలుగు రాష్ట్రాల‌కూ క‌నిపించ‌డం లేదన్నారు. పైగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా.. పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలతో ప్ర‌భుత్వాలు అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. ”మీరు అప్పులు చేస్తున్నారంటే.. మీరు అప్పులు చేస్తున్నార‌ని ఒక పార్టీపై మ‌రోపార్టీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Venkaiah Naidu: Former Vice President criticizes free schemes
Venkaiah Naidu: Former Vice President criticizes free schemes

మ‌ళ్లీవారు అధికారంలోకి వ‌స్తే.. అదే ప‌ని చేస్తున్నారు” అని దుయ్య‌బ‌ట్టారు.ఉచిత ప‌థ‌కాలు కేవ‌లం అర్హులైన వారికి మాత్ర‌మే అందాల‌ని వెంక‌య్య‌నాయుడు (Venkaiah Naidu) సూచించారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు అనుకూలంగా ఉన్న‌వారికి ఉచితాలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. దీనివ‌ల్ల అస‌లైన అర్హులు న‌ష్ట‌పోతున్నార‌ని చెప్పారు. ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం అనే ఈ రెండు రంగాల్లో మాత్ర‌మే ఉచితాన్ని అనుస‌రించాల‌ని ఆయ‌న సూచించారు. అప్పుడే రాష్ట్రాలు బాగుప‌డ‌తాయ‌ని.. లేక‌పోతే అప్పులు పెరుగుతాయ‌ని హెచ్చ‌రించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870