బంగ్లాదేశ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ప్రసారాలపై తాత్కాలిక ప్రభుత్వం నిరవధిక నిషేధం విధించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వచ్చే ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఎంతో నమ్మకమైన ఆటగాడని ఎటువంటి కారణం లేకుండా తొలగించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.ఇది కేవలం ఒక క్రీడాకారుడికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, తమ దేశ గౌరవానికి సంబంధించిన విషయమని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది.
Read also: Virat Kohli: రూ.300 కోట్ల డీల్‌ను తిరస్కరించిన విరాట్
అంతర్జాతీయ క్రికెట్ మండలికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఐపీఎల్ ప్రమోషన్, ప్రసారాలను ప్రభావితం చేయనున్నాయి. ఈ వివాదం కేవలం ఐపీఎల్ తోనే ఆగడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ఘాటైన లేఖ రాసింది.

2026 ఫిబ్రవరిలో భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు పాల్గొనే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం భారత్‌లో తమ ఆటగాళ్లకు సేఫ్టీ లేదని, అక్కడి వాతావరణం నిష్పక్షపాతంగా లేదని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఐసీసీ అంగీకరించకపోతే, తాము వరల్డ్ కప్ కోసం భారత్‌కు జట్టును పంపే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ తెగేసి చెప్పింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: