हिन्दी | Epaper
సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Srikalahasti: కేంద్ర మంత్రి రాహుకేతుదోష పూజలు

Saritha
Srikalahasti: కేంద్ర మంత్రి రాహుకేతుదోష పూజలు

శ్రీకాళహస్తి : దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో(Srikalahasteeswara Temple) ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కుటుంబసభ్యులతో (Srikalahasti) కలసి రాహుకేతుదోష నివారణ పూజలు జరిపించుకున్నారు. కేంద్ర మంత్రి రాక సందర్భంగా దక్షిణ గోపురం వద్ద ఆలయ ప్రోటోకాల్ మేరకు ఇఓ డి. బాపిరెడ్డి వేద పండితులతో ఆలయ మర్యాదలతో మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.

Read also: Sakey Sailajanath PressMeet: రాయలసీమ పథకాలపై విమర్శలు

Srikalahasti

మంత్రి ఆలయంలో నిర్వహించే రాహుకేతుదోష నివారణ పూజలు జరిపించు కోవాలని కోరగా ఇఓ బాపిరెడ్డి వెంటనే వారికి ప్రత్యేక రాహుకేతు దోష నివారణ టిక్కెట్టు రూ.5 వేల కొనుగోలు చేసి సహస్రలింగేశ్వరుని ఆలయం వద్ద ఏర్పాటు చేసారు. (Srikalahasti) వేదపండితులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. వారికి స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసారు. మృత్యుంజయస్వామి ఆలయం వద్ద వారికి వేదపండితులతో ప్రత్యేకాశీర్వచనాలు అందించారు. ఎఇఓలు మోహన్, విద్యాసాగర్ రెడ్డిలు వారికి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను తీర్థ ప్రసాదాలను అందించారు. ఏర్పాట్లును ఆలయ ఎపిఆర్లు రవి, శ్రీనివాసులు, టెంపుల్ ఇన్సెపెక్టర్లు వెంకటస్వామి, హరికృష్ణ, సుదర్శనం నాయుడు పర్యవేక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870