ఆంధ్ర (AP) సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు హాజరయ్యారు. నేటితో ప్రపంచ తెలుగు మహాసభలు ముగియనున్నాయి. ప్రముఖులు, రాజకీయ నేతలు సభలో ప్రసంగించనున్నారు..సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు.
Read also: Andhra Pradesh: ఇవాళ్టితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు

మరింత ప్రాధాన్యం
సభకు భారీగా ప్రజలు తరలిరావచ్చని అంచనా వేసిన అధికారులు, తగినంత పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించారు. ముఖ్యమంత్రి పర్యటన గుంటూరు జిల్లాకు మరింత ప్రాధాన్యం తీసుకురావడంతో పాటు, తెలుగు మహాసభలకు కొత్త ఊపునిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన రాజకీయంగా, సాంస్కృతికంగా కీలక ఘట్టంగా నిలవనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: