हिन्दी | Epaper

Punjab Crime: ఆప్‌ నేత జర్మల్ సింగ్‌ దారుణ హత్య

Pooja
Current image: Punjab Crime

పంజాబ్ రాష్ట్రంలో(Punjab Crime) మరోసారి రాజకీయ హింస కలకలం రేపింది. తంగ్ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత జర్మల్ సింగ్ (50)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య

అమృత్‌సర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో(Punjab Crime) జరిగిన వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ దాడి జరిగింది. వేడుక జరుగుతున్న ప్రదేశంలోకి చొరబడిన దుండగులు జర్మల్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తలకు తుపాకీ గుండె తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో పాల్గొన్నవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Punjab Crime

ఈ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. గతంలో జర్మల్ సింగ్‌పై మూడుసార్లు హత్యాయత్నాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ సరైన భద్రత లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలు, వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అన్న కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

📢 For Advertisement Booking: 98481 12870