

బెంగళూరు(Bengaluru) నగరంలోని మాడివాళ(Madivala) ప్రాంతంలో ఉన్న సంధ్య థియేటర్‌లో జనవరి 4న ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమా ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో, థియేటర్‌లో పని చేసే ఓ ఉద్యోగి మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు.
Read Also: Srikakulam: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఈ విషయం గమనించిన మహిళలు పెద్దగా అరవడంతో థియేటర్‌లో కలకలం చెలరేగింది. వెంటనే అప్రమత్తమైన ప్రేక్షకులు అక్కడికి చేరుకుని, నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అతడిని మడివాళ పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. మహిళల గోప్యతను ఉల్లంఘించిన ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నగరంలో భద్రతపై ఆందోళనలకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: