हिन्दी | Epaper
త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Jananayagan: ‘పరాశక్తి’ బ్యానర్లు చింపేస్తూ రచ్చ చేసిన విజయ్ ఫ్యాన్స్‌

Anusha
Vijay fans create ruckus by tearing down 'Parashakti' banners
Vijay fans create ruckus by tearing down ‘Parashakti’ banners

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇన్నాళ్లు హీరోగా అలరించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన నటిస్తూన్న చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రాన్ని తెలుగులో జన నాయకుడు (Jananayagan) పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానుల అత్యుత్సాహం ఒకింత హద్దులు దాటినట్టుగా కనిపిస్తోంది.

Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి?

సినిమా బ్యానర్లను చించివేయడం

‘జన నాయగన్ ’ (Jananayagan)ట్రైలర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో, అదే సంక్రాంతికి విడుదల కానున్న శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి’ సినిమా బ్యానర్లను చించివేయడం, కొన్ని చోట్ల కిందపడేసి తొక్కడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, శివ కార్తికేయన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పోటీ ఉండొచ్చు కానీ ఇలా బ్యానర్లు తొలగించడం దారుణమని విమర్శలు చేస్తున్నారు.

ఎన్ని అడ్డంకులు పెట్టినా సంక్రాంతి బరిలో ‘పరాశక్తి’ నిలబడుతుందని వారు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సంఘటనలతో తమిళ ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ చివరి చిత్రం కావడంతో ‘జననాయగన్’ హిట్ కావాలని తాము కోరుకుంటుంటే.. విజయ్ అభిమానులు తమ హీరో చిత్రంపై విషం కక్కడం పద్ధతి కాదని శివ కార్తికేయన్ ఫ్యాన్స్ అంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870