తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రాయుడు తన భార్య, కొడుకుతో దిగిన సెల్ఫీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రాయుడు 2009లో విద్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగ్‌లలో ఆడుతూ, క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.
Read also: Bangladesh T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్ 2026, భారత్‌కు రాని బంగ్లాదేశ్?
40 ఏళ్ల వయసులో తండ్రయిన అంబటి రాయుడు
అంబటి రాయుడు, విద్యకు 2009లో వివాహం జరగ్గా.. 2020 జూలైలో ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడ బిడ్డ జన్మించింది. ఆ పాపకు వివియా అని పేరు పెట్టారు. అనంతరం 2023లో రెండోసారి తండ్రి కాగా.. మరోసారి కూతురే పుట్టింది. తాజాగా 40 ఏళ్ల వయసులో అంబటి రాయుడు (Ambati Rayudu) మూడో సారి తండ్రి కాగా.. ఈసారి మగ బిడ్డ పుట్టాడు.
సోషల్ మీడియా, మీడియాకు చాలా దూరంగా ఉండే రాయుడు.. వ్యక్తిగత గోప్యత పాటిస్తాడు. అతని కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించడానికి ఇష్టపడ్డాడు. మూడోసారి తండ్రైన అంబటి రాయుడుకు సహచర క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు, అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: