కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపాయి. తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐఎస్) పనులను నిలిపివేశారని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. “నా మీద ఉన్న గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: CM Chandrababu: బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం అభినందనలు

త్వరలోనే మాట్లాడతా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో తనకు తెలుసని, కృష్ణా జలాల వివాదంపై త్వరలోనే మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: